నేను జగన్ ఫ్యాన్... చిరంజీవితో గొడవల్లేవంటున్న వైసీపీ నేత

జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందన్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 11:56 AM IST
నేను జగన్ ఫ్యాన్... చిరంజీవితో గొడవల్లేవంటున్న వైసీపీ నేత
చిరంజీవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవంటున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి... ఆ పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని స్పష్టం చేశారు.

తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్నరోజుల్లో చిరంజీవిగారు ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందన్నారు. తనకు అభిమాన సంఘాలు అంటూ లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. జగన్‌గారికి మాత్రమే ఉంటాయి. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
First published: October 12, 2019, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading