చేగువేరాయే నాకు స్ఫూర్తి.. కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

ఉమా భారతి (ఫైల్ ఫొటో)

2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా దూరంగా ఉండేందుకు తనను ముగ్గురు మహానుభావుల జీవితాలు స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. వారిలో మొదటి వ్యక్తి హనుమంతుడు కాగా, రెండో వ్యక్తి విప్లవయోధుడు చేగువేరా, మూడో వ్యక్తి శివాజీ మహారాజ్ అని తెలిపారు.

  • Share this:
    సాధారణంగా బీజేపీ, సంఘ్ పరివార్, ఇతర రైటిస్ట్ భావజాలం కలిగిన నేతలు వామపక్ష భావజాలంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఏకీభవించరు. అంతేకాదు వామపక్ష సిద్ధాంతాలను, అలాగే వామపక్ష నేతలను తీవ్రంగా విమర్శిస్తుంటారు. అలాంటిది సంఘ్ పరివార్ నేపథ్యం కలిగి ఉండి, బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఉమాభారతి, తనకు కమ్యూనిస్టు యోధుడు చేగువేరా తనకు జీవిత కాల స్ఫూర్తిప్రదాత అని కీర్తించారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా దూరంగా ఉండేందుకు తనను ముగ్గురు మహానుభావుల జీవితాలు స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. వారిలో మొదటి వ్యక్తి హనుమంతుడు కాగా, రెండో వ్యక్తి విప్లవయోధుడు చేగువేరా, మూడో వ్యక్తి శివాజీ మహారాజ్ అని తెలిపారు. ముగ్గురు కూడా విజయం సాధించిన తర్వాత పదవులను సమర్థత ఉన్నా రాజ్యకాంక్షను వదులుకున్నవారే అని కొనియాడారు. క్యూబా విప్లవ యోధుడు చేగువేరా యుద్ధంలో విజయం సాధించిన అనంతరం పదవుల్లో స్థిరపడకుండా... మరో దేశం కష్టాల్లో ఉందని తన అవసరం వారికి ఉందని వెళ్లి ప్రాణత్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు.

    ఇదిలా ఉంటే 2014లో ఝాన్సీ నుంచి నిలబడిన ఈ సారి ఎన్నికల్లో మాత్రం పోటీ నుంచి వైదొలిగారు. అంతేకాదు, సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రధాని పదవి చేపట్టేందుకు అర్హుడని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నతపదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు.
    First published: