పంజాబ్​ ముఖ్యమంత్రిగా చరణ్​జీత్​ సింగ్​ చన్నీ ప్రమాణ స్వీకారం.. సుఖ్​జీందర్​, ఓపీ సోనీలకు డిప్యూటీ సీఎం పదవులు

ప్రమాణ స్వీకారం చేస్తున్న చరణ్​జీ, సుఖ్​జిందర్​, సోని (Photo: ANI/ Twitter)

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చరణ్‌జీత్‌తో ప్రమాణం చేయించారు. చన్నీతోపాటు కాంగ్రెస్ నేతలు సుఖ్​జీం​దర్ ఎస్ రాంధవా, ఓపీ సోని డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 • Share this:
  పంజాబ్ (Punjab) కొత్త ముఖ్యమంత్రి (Chief minister)గా దళిత ఎమ్మెల్యే చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ (Charanjit Singh channi) ప్రమాణ స్వీకారం చేశారు.  సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ చరణ్‌జీత్‌తో ప్రమాణం చేయించారు. చన్నీతోపాటు కాంగ్రెస్ నేతలు సుఖ్​జీం​దర్ ఎస్ రాంధవా (Sukhjinder singh randhawa), ఓపీ సోని (OP Soni) డిప్యూటీ సీఎం (Deputy CM)లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) , పీసీసీ చీఫ్​ నవ్యజోత్​ సింగ్​ సిద్దూ కూడా హాజరయ్యారు. కాగా.. ప్రమాణస్వీకారానికి ముందు సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ కుటుంబసభ్యులతో కలసి చరణ్‌జీత్‌ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సీఎంకు పలువురు ఘనస్వాగతం పలికారు.  పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra modi) అభినందనలు తెలిపారు. "పంజాబ్ ప్రజల అభ్యున్నతి కోసం పంజాబ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే ఉంటాను" అని ప్రధాని ట్విటర్​​లో తెలిపారు.

  ఈ సందర్భంగా రాహుల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. చన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రి (First dalit CM)గా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ నిలిచారు.

  కాగా, పంజాబ్​ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్​జీత్​ సింగ్​ చన్నీకి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి (Mayawati) శుభాకాంక్షలు తెలిపారు.  “పంజాబ్ ముఖ్యమంత్రి అయినందుకు చరంజిత్ సింగ్ చన్నీని నేను అభినందిస్తున్నాను. అతడిని ఇంతకుముందు సీఎం (CM)గా నియమించి ఉంటే బాగుండేది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు చన్నీ సీఎంగా నియామకం ఎన్నికల జిమ్మిక్కుగా కనిపిస్తుంది”అని తెలిపారు.

  చరణ్​జీత్​​​ సింగ్​​ చన్నీ గతంలో పంజాబ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ & ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మంత్రిగా పనిచేశారు. చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 నుంచి 2016 వరకు పంజాబ్ విధాన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చరణ్​జీత్​​​ సింగ్​​ రామదాసియా సిక్కు వర్గానికి చెందిన దళిత వ్యక్తి. 47 సంవత్సరాల వయస్సులో పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published: