Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లెక్క.. ఆ నేత ఎంట్రీతో..

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా వచ్చిన సీనియర్ నేత మాణికం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్‌కు చికిత్స మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: October 1, 2020, 2:35 PM IST
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లెక్క.. ఆ నేత ఎంట్రీతో..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ, సంప్రదాయాలు మిగతా పార్టీలకంటే భిన్నంగా ఉంటాయి. అక్కడ నాయకులు స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉంటుంది. అయితే అది తమ పార్టీ గొప్పతనమని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ ఇలాంటి తీరు వల్ల ఆ జనంలో ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే టాక్ కూడా ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా వచ్చిన సీనియర్ నేత మాణికం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్‌కు చికిత్స మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైన మాణికం ఠాగూర్.. కొందరు ఊహించని షాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతగా పార్టీలో జరిగే దాదాపు అన్ని సమావేశాలకు హాజరయ్యే మాజీ ఎంపీ వి హనుమంతరావును ఇటీవల ఓ సమావేశానికి హాజరుకావడంపై మాణికం ఠాగూర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో వీహెచ్ ఒక్కసారిగా అవాక్కయ్యారని సమాచారం. ఆయనే కాదు.. అక్కడ ఉన్న నేతలు సైతం ఈ పరిణామంతో షాక్ అయ్యారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తాను వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలపై కూడా మాణికం ఠాగూర్ ఆరా తీశారని.. దీనిపై జగ్గారెడ్డితోనే వివరణ కూడా ఇప్పించారని సమాచారం.

మాణికం ఠాగూర్( ఫైల్ ఫోటో)


ఆయన తీరును గమనిస్తున్న పలువురు నేతలు.. మాణికం ఠాగూర్ తీరు గత నేతలకు భిన్నంగా ఉందని చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి పెట్టారని అంటున్నారు. ఎవరైనా పార్టీ కంటే గొప్ప కాదు అనే సంకేతాలను ఇవ్వడంతో పాటు సీనియర్, జూనియర్ అనే తేడాలు చూపించవద్దనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండబోతోందని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఎంట్రీలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసిన మాణికం ఠాగూర్.. ప్రజల్లో పడిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ ఇమేజ్‌ను మళ్లీ పెంచుతారేమో చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: October 1, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading