Chandrababu Naidu: చంద్రబాబుకు కొత్త టెన్షన్ పెట్టిన తెలంగాణ తమ్ముళ్లు

Chandrababu Naidu Telangana TDP: ఎక్కువగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేసిన చంద్రబాబు.. తెలంగాణ టీడీపీలో మార్పులు చేస్తారా ? లేక ఎప్పటిలాగే ఈ ప్రక్రియను వాయిదా వేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: September 21, 2020, 5:51 PM IST
Chandrababu Naidu: చంద్రబాబుకు కొత్త టెన్షన్ పెట్టిన తెలంగాణ తమ్ముళ్లు
చంద్రబాబునాయుడు
  • Share this:
Telangana TDP: టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ పార్టీ నేతలు లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. అయితే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. సీట్ల సంఖ్యతో పాటు ఓట్ల శాతం కూడా భారీగా పడిపోయింది. అయితే తెలంగాణ నేతలకు తానున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు... టీటీడీపీ అధ్యక్షుడితో పాటు పార్టీ కార్యవర్గంలో మార్పులు చేసేందుకు గతంలో కసరత్తు చేశారు.

అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడేళ్లగా టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ కొనసాగుతున్నారు. ఆయనను మార్చాలని తాజాగా పలువురు పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులు చంద్రబాబుకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిని మార్చడంతో పాటు పార్లమెంటరీ పార్టీ ఇంఛార్జ్‌లను మార్చాలని పలువురు చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది.

Protest against inter board : TDP president Ramana arrested in Hyderabad
ఎల్.రమణ(ఫైల్ ఫోటో)


అయితే ఎక్కువగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేసిన చంద్రబాబు.. తెలంగాణ టీడీపీలో మార్పులు చేస్తారా ? లేక ఎప్పటిలాగే ఈ ప్రక్రియను వాయిదా వేస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈసారి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిని మార్చకపోతే పార్టీ మరింత నష్టపోకతప్పదని టీడీపీ నేతలు చంద్రబాబుకు రాసిన లేఖలో సూచించినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఈసారైనా తెలంగాణ టీడీపీపై సీరియస్‌గా ఫోకస్ చేస్తారని పలువురు టీటీడీపీ నేతలు భావిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 21, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading