CHANDRABABU WILL LOSE THE ELECTION IN ANDHRAPRADESH SAYS CM KCR IN VIAKARABAD MS
లేటెస్ట్ సర్వే రిపోర్ట్.. చంద్రబాబు కహానీ ఖతమ్ అయిపోయింది : కేసీఆర్
కేసీఆర్, చంద్రబాబు (File)
KCR Election Campaign : ఎంఐఎంతో కలిసి తెలంగాణలో 17 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలవబోతుందని.. అటు ఏపీలోనూ వైసీపీ బ్రహ్మాండంగా గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఇరువురం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని.. కేంద్రంలోని ఫెడరల్ ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు లాంటి కొంతమందితోనే తమకు పంచాయితీ అని.. అక్కడి ప్రజలతో తమకెలాంటి గొడవలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంపై దారుణంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తాము మద్దతునిస్తే.. కేసీఆర్ వచ్చి నీకు చెవిలో చెప్పాడా? అని జగన్‌ను చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు.చెవిలో చెప్పాల్సిన అవసరం తమకు లేదని.. లక్షలాది మంది ఉన్న ఈ బహిరంగ సభ వేదిక నుంచే తాను చెబుతున్నానని.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. నీలాగా చీకటి పనులు చేయడం.. కుట్రలు చేయడం తమకు రావని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. హైదరాబాద్‌పై, తెలంగాణపై చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని.. ఆయన పని అయిపోయినందువల్లే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. ఇటీవలే తనకు సర్వే రిపోర్ట్ అందిందని.. ఏపీలో చంద్రబాబు కహానీ ఖతమ్ అయిపోయిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఎంఐఎంతో కలిసి తెలంగాణలో 17 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలవబోతుందని.. అటు ఏపీలోనూ వైసీపీ బ్రహ్మాండంగా గెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ఇరువురం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని.. కేంద్రంలోని ఫెడరల్ ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు లాంటి కొంతమందితోనే తమకు పంచాయితీ అని.. అక్కడి ప్రజలతో తమకెలాంటి గొడవలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. మేము బతకాలి.. పక్కోడు కూడా బతకాలి అన్నదే తెలంగాణ గుణం అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు తాము ఏనాడు అడ్డుపడలేదని.. తెలంగాణను ముంచుతానంటేనే అభ్యంతరం చెప్పామని అన్నారు. తాము కోరేదల్లా తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడమే అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తాము సహకరిస్తామని చెప్పారు.
ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని.. బీజేపీకి 150, కాంగ్రెస్‌కి 100 సీట్లు మించవని చెప్పారు.ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలు రెండింటిలోనూ తాను చెప్పిన అంశాలే కనిపించాయని.. తెలంగాణలో అమలవుతున్న పథకాలే కాపీ కొట్టారని అన్నారు. దేశంలో ఉన్న నీటి వనరులను, ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఇప్పటిదాకా సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నామని తాను చెబితే.. ఇప్పుడీ రెండు పార్టీలు ఆ అంశాలను మేనిఫెస్టోలో పెట్టాయని చెప్పారు. జల సమర్థ వినియోగ పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడితే.. ట్రక్కుల వేగాన్ని పెంచుతామని, ఫ్రీ కారిడార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టిందని పేర్కొన్నారు.
ఇక వికారాబాద్ జిల్లా డిమాండ్ ఏనాటి నుంచో ఉన్నా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే అది సాకారం అయ్యిందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 111 జీవోను ఎత్తివేసి చేవెళ్ల ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఐదేళ్ల క్రితం ఆగమాగం ఉన్న తెలంగాణ.. ఇప్పుడు వెలుగు జిలుగులతో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని.. టీఆర్ఎస్ 16మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రం మరింత పురోగమిస్తుందని భరోసా ఇచ్చారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.