Hyderabad Rains: వరదల వేళ హైదరాబాద్ వాసులకు చంద్రబాబు కీలక సూచన.. పార్టీ శ్రేణులకు పిలుపు

Hyderabad Rains: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జల విపత్తు ముగిసే వరకు హైదరాబాద్ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు.

news18-telugu
Updated: October 20, 2020, 2:32 PM IST
Hyderabad Rains: వరదల వేళ హైదరాబాద్ వాసులకు చంద్రబాబు కీలక సూచన.. పార్టీ శ్రేణులకు పిలుపు
చంద్రబాబు
  • Share this:
హైదరాబాద్ మహానగర వాసులను వరుణ దేవుడు వణికిస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఎన్నడూ లేనంత వరద నగరాన్ని చుట్టేస్తోంది. అనేక కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో వాగుల్లో లాగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద కారణంగా అనేక మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా.. మరి కొంత మంది ఇళ్లు కూలిపోయి.. నిత్యావసరాలు తడిసి పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం హైదరాబాద్ లో వరదల బీభత్సం పై స్పందించాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ. 15 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జల విపత్తు ముగిసే వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. ‘మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి’ అని సూచించారు. హైదరాబాద్ ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నానన్నారు. టీడీపీ నాయకులు, శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.



తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దకు వెళ్లి అక్కడే ఈ ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ సిబ్బంది.. ఈ సాయం అందించనున్నారు. వరద బాధితులకు అవసరమైతే ఆర్థిక సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి/కుటుంబానికి ఈ సాయం అందాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ మునిసపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందించాలని కోరారు.

అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  కాగా, వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించిన విషయం విదితమే.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading