HOME »NEWS »POLITICS »chandrababu to land in bengaluru to meet dewegowda and kumaraswamy

బెంగళూరుకు చంద్రబాబు... దేవేగౌడ, కుమారస్వామితో భేటీ

బెంగళూరుకు చంద్రబాబు... దేవేగౌడ, కుమారస్వామితో భేటీ
కుమారస్వామి, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తానన్న చంద్రబాబు... ఇందుకోసం బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలతో చర్చించనున్నారు. ఈ వారంలోనే టీడీపీ అధినేత చెన్నైకు కూడా వెళతారని తెలుస్తోంది.

  • Share this:
    బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి తనవంతు కృషి చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... ఇందులో భాగంగా జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ కానున్నారు. ఇందుకోసం గురువారం చంద్రబాబు బెంగళూరు వెళ్లనున్నారు. ఈ వారంలోనే జేడీఎస్‌తో పాటు కర్ణాటకలోని డీఎంకే నేతలతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేడీఎస్‌ను ప్రత్యేకంగా అభినందించనున్న టీడీపీ అధినేత... జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చే అంశంపై దేవేగౌడ, కుమారస్వామితో చర్చించనున్నారు.

    కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన చంద్రబాబు... ఇందుకు సంబంధించి దేవేగౌడ, కుమారస్వామి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చలు జరిపిన చంద్రబాబు... దక్షిణాదిలో కీలకంగా ఉండే జేడీఎస్, డీఎంకే పార్టీల నేతలను కలవబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీఎస్‌తో భేటీ అనంతరం ఇదే వారంలో చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో చంద్రబాబు చర్చలు జరపబోతున్నట్టు సమాచారం.



    కాంగ్రెస్ సారథ్యంలోని జాతీయ కూటమిలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న చంద్రబాబు... ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్ తగలడంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు... దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ఇదే రకమైన ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఐక్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:November 07, 2018, 19:16 IST