Nara Lokesh ఫ్రమ్ Dubai: ఫ్యామిలీతో వచ్చా -బొంబాయి కబుర్లు ఆపి, ఐవరీ కోస్ట్ దొంగను పట్టుకోండి -AP drug case ప్రతిసవాల్

నారా లోకేశ్ (ఫైల్)

Nara Lokesh on Drug Case | ‘నారా లోకేశ్‌ ఇప్పుడు దుబాయ్‌లో ఏం చేస్తున్నట్లు? అధికారంలో ఉండగా దోచుకున్న ప్రజాధనంతో చంద్రబాబు, లోకేశ్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? అందుకే దుబాయ్, మారిషర్ చక్కర్లు కొడుతున్నారా?’ అంటూ జగన్ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా, వాటికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం అంతే ఘాటుగా కౌంటరిచ్చారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న లోకేశ్.. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా సజ్జలకు ప్రతిసవాలు విసిరారు..

  • Share this:
గుజరాత్ పోర్టులో బట్టబయలైన భారీ డ్రగ్స్ దందాతో ఆంధ్రప్రదేశ్ నేతలకు లింకులున్నాయనే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. గుజరాత్ నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరాలో సూత్రధారులు మీరంటే మీరంటూ వైసీపీ, టీడీపీ నేతలు వాదులాడుకుంటున్నారు. డ్రగ్స్ దందాను నేరుగా సీఎం జగన్ కు, వైసీపీ ఎమ్మెల్యేలకు ముడిపెడుతూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం చంద్రబాబు, లోకేశ్ పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బుధవారంనాడు లోకేశ్ రియాక్ట్ అయ్యారు..

ప్రస్తుతం నారా లోకేశ్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. డ్రగ్స్ దందాలోకి తన పేరు లాగడంపై తీవ్రంగా ఫైరైన ఆయన.. సజ్జలను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపండి..’అని ప్రతిసవాలు విసిరారు. అంతేకాదు,

‘నలభై ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరే ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా?’ అని ప్రశ్నించిన లోకేశ్.. సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటి కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారని ఆరోపించారు. 72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులోనూ జగన్ రెడ్డే ఏ1 ముద్దాయి అని పేర్కొన్నారు.

తన దుబాయ్ పర్యటనపై సజ్జల కామెంట్ చేయడాన్ని కూడా లోకేశ్ తప్పు పట్టారు. ‘యెస్. నేను దుబాయ్ లో నా కుటుంబసభ్యులతో వున్నా. కావాలంటే నా పర్యటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించండి. అలాగే, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా (డ్రగ్స్ హెవెన్ గా పేరొందిన) ఐవరీ కోస్ట్ కు ఎందుకు వెళ్లొచ్చారనే దానిపైనా దర్యాప్తుకి సిద్ధమా? బ్రోకర్ సజ్జలా!’ అని ఫైరయ్యారు.

నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో నడుస్తోన్న హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం తమ కుటుంబానిదని, అదే జగన్ అండ్ కోది మాత్రం జనం ప్రాణాలు తీసి..లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలని లోకేశ్ ఆరోపించారు. అక్టోబర్ 1న చాలెంజ్ చేసి మరీ డ్రగ్ టెస్ట్ లకి మా టిడిపి యువనేతల బృందం వస్తే, వైసీపీ నేతలు తోకముడిచారని, దాంతో డ్రగ్స్ మాఫియా సూత్రధారులు, వాడకందారులు వైసీపీ వాళ్లేనని తేలిపోయిందని, ఇప్పుడు సజ్జల తీరు డ్రగ్స్ దొంగే...దొంగా..దొంగా అన్నట్లుగా ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published: