వైసీపీ వల్లే వరల్డ్ బ్యాంక్ వెనక్కి తగ్గింది: చంద్రబాబు

రైతులతో అమరావతి నిర్మాణంపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: July 19, 2019, 12:01 PM IST
వైసీపీ వల్లే వరల్డ్ బ్యాంక్ వెనక్కి తగ్గింది: చంద్రబాబు
చంద్రబాబు (File)
  • Share this:
అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి ప్రభుత్వమే కారణమని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. రైతులతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్లకు అభివృద్ధి అవసరం లేదని... పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే ఇసుక దొరక్క రేటు రెండింతలు పెరిగిపోయిందన్న చంద్రబాబు... నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ... బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజధాని అభివృద్ధి చెందడం వైసీపీకి ఏ మాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.


First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>