అమరావతిలో భారీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ చేసి భారీగా డబ్బులు దండుకున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

news18-telugu
Updated: December 29, 2019, 5:31 PM IST
అమరావతిలో భారీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది : కొడాలి నాని
ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప పార్టీకి మనుగడ లేదేమో అని ఈయనే కామెంట్ చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినా కూడా పార్టీ గతి అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ చేసి భారీగా డబ్బులు దండుకున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. భారీ రాజధాని నిర్మిస్తానని వేలాది ఎకరాలు సేకరించి.. రాష్ట్ర ప్రజలకు గ్రాఫిక్స్ రాజధాని చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని నిర్మాణానికి రూ.1లక్షా 15వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి రాజధాని సాధ్యపడదన్నారు. ఇదే విషయాన్ని రైతులకు వివరిస్తామని,వారు సానుకూల దృక్పథంతో అర్ధం చేసుకుని సహకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక అన్ని ప్రాంతాల సమఅభివృద్దికి దోహదపడేదిగా ఉందన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు తాము ఎక్కడా చెప్పలేదని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది

చెందాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటైతే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 29, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading