టీడీపీపై కక్ష సాధింపునకు ఏమైనా చేయొచ్చు...ఆ ఒక్కటి సహించలేం

టీడీపీపై కక్ష సాధింపు కోసం జగన్ సర్కారు ఏం చేసినా భరింగలంకానీ...అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదలను కష్టపెట్టడాన్ని మాత్రం సహించలేకపోతున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

news18-telugu
Updated: August 16, 2019, 9:57 AM IST
టీడీపీపై కక్ష సాధింపునకు ఏమైనా చేయొచ్చు...ఆ ఒక్కటి సహించలేం
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 16, 2019, 9:57 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అన్నా క్యాంటీన్లను మూసివేయడాన్ని టీడీపీ సహించలేకపోతోందని అన్నారు. టీడీపీ మీద కక్షతో జగన్ సర్కారు ఏమైనా చేయొచ్చు కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని మాత్రం సహించలేకపోతోందని విమర్శించారు. అందుకే ఈ రోజు అన్న క్యాంటీన్ల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీతో అందరూ కలిసిరావాలని, క్యాంటీన్లను తిరిగి తెరిచే వరకు ఉద్యమిద్దామంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

అన్నా క్యాంటీన్ల మూసివేతతో లక్షలాది మంది ప్రజలు రూ.5కే పౌష్టిక భోజనం తినే అవకాశాన్ని కోల్పోతున్నారని, అలాగే 20 వేల మంది ఉపాధిని కోల్పోయారని మరో ట్వీట్‌లో చంద్రబాబు విమర్శించారు. ఇలా శిక్షించేందుకు ప్రజలు చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...