ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు

ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇంటర్ చదివిన వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.

news18-telugu
Updated: April 2, 2019, 7:14 PM IST
ఇంటర్ చదివిన వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు మరో వరం ప్రకటించారు. ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇంటర్ చదివిన వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. గాలేరు, నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పుత్తూరుకు కూడా గోదావరి నీళ్లు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అయితే, దీన్ని పెంచుతామని ఇటీవల చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా వర్తింపజేయాలనుకుంటున్నట్టు ప్రకటన చేశారు.
First published: April 2, 2019, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading