భువనేశ్వరికి అవమానం తర్వాత తొలిసారి -సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు -ప్రత్యేక విమానంలో..

కడప ఎయిర్ పోర్టుల చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల స్వాగతం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం జగన్ ఇలాకా కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు.

  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరికి అవమానం జరిగిందని విలపించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానన్నారు. ఈ ఉదంతంలో జాతీయ నేతలు, సెలబ్రిటీలు పలువురు ఫోన్లు చేసి బాబును పరామర్శించారు. గత శుక్రవారం నుంచి ఆవేదనలోనే ఉన్న చంద్రబాబు.. వరద పరిస్థితులపై టీడీపీ శ్రేణులతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూనే ఉన్నారు. బాధిత ప్రజలను ఆదుకోకుండా సీఎం జగన్ పెళ్లివేడుకలకు తిరుగుతుండటాన్ని టీడీపీ తప్పుపట్టింది. కష్టసమయంలో ప్రజలకు అండగా ఉంటామంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు మంగళవారం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన ప్రారంభించారు. భువనేశ్వరి ఉదంతం, కన్నీరు పెట్టుకున్న సందర్భం తర్వాత చంద్రబాబు ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం జగన్ ఇలాకా కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో కడప చేరుకున్న చంద్రబాబు.. ఎయిర్ పోర్టు నుంచి సిటీ శివారు వరకు ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో మాదిరిగా ముందుకుసాగారు.

నా భార్యనూ గదిలో అలా ఫొటోలు తీశారు -ఆత్మహత్య ఆగింది కూడా ఇందుకే -భువనేశ్వరి ఉదంతో భారీ కుదుపు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జల విలయం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. ఇవాళ్టి కడప జిల్లా పర్యటనలో చంద్రబాబు.. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో పర్యటించి, వరద బాధితులను పరామర్శిస్తారు. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు హడావుడి చేయగా, కడప ఎయిర్ పోర్టు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు.
Published by:Madhu Kota
First published: