ఏపీలో నెక్ట్స్ సీఎం జగన్... కాదు చంద్రబాబు... జ్యోతిష్యులు ఏమంటున్నారంటే...

జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ది ఆరుద్ర నక్షేత్రం .....చంద్ర‌బాబు ది పుష్య‌మీ న‌క్షత్రం దీంతో రాహుకాలంలో వ‌చ్చిన ఎన్నికల నోటిఫికేషన్ వ‌ల‌న ఎవరికి ఇది ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉందో జ్యోతిష్యులు వివరించారు.

news18-telugu
Updated: April 17, 2019, 2:31 PM IST
ఏపీలో నెక్ట్స్ సీఎం జగన్... కాదు చంద్రబాబు... జ్యోతిష్యులు ఏమంటున్నారంటే...
చంద్రబాబు, జగన్(File)
news18-telugu
Updated: April 17, 2019, 2:31 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు ఫలితాల వంతు. అన్నిపార్టీలు గెలుపోటములపై లెక్కలేసుకుంటున్నారు. ఎవరు విజయం సాధిస్తారో...? ఎవరు ఓటమి పాలవుతారోనని ? టెన్షల్ ఉన్నారు. అయితే ఏదీ తేలాలన్న కూడా మే 23వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అప్పుడే వస్తాయి కాబట్టి. అయితే సందట్లో సడేమియా అన్నట్లు.. జ్యోతిష్యులు కూడా ఎన్నికల వేళ సందడి చేస్తున్నారు. వాస్తులు, దోషాలు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కొందరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డియే సీఎం అవుతారంటుంటే.. మరికొందరు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. వీటికి వాస్తులు, దోషాలు, రాహుకాలాల లెక్కలు సైతం జోడిస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్యుతుల కొమ్మినేని మల్లేశ్వరరావు సిద్ధాంతి ఏపీ ఎన్నికలపై ముందుగానే జోస్యం చెప్పారు. మళ్లీ చంద్రబాబే ఏపీలో అధికారం చేపడతారన్నారు. ఆయన ఇంటికి ఉన్న అద్భుతమైన వాస్తే చంద్రబాబుకు కలిసొస్తుందంటున్నారు కొమ్మినేని.

హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి అద్భుతమైన వాస్తు ఉందని అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారన్నారు. అంతేకాదు... నారా లోకేష్ కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతారన్నారు కొమ్మినేని సిద్ధంతి. ఇదే సమయంలో జగన్ గెలుపోటములపై కూడా జ్యోతిష్యాలు వల్లిస్తున్నారు సిద్ధాంతులు. జగన్‌కు ఉన్న జాతకం ప్రకారం ఆయనే నెక్ట్స్ సీఎం అవుతారంటున్నారు. వైఎస్ జగన్ జాతకాన్ని ప్రముఖ జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ తనదైన శైలిలో విశ్లేషించారు. జగన్ జాతకంలో ఏప్రిల్ 30 వరకూ శని మహర్ధశలో ఉంటుందని, ఆ తర్వాత బుధ మహర్దశ ప్రారంభమవుతుందని వివరించారు. జగన్ ఆరుద్రా నక్షత్రం, కన్యాలగ్నంలో, మిథున రాశిలో జన్మించినందువల్ల... శక్తిమంతమైన బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఆయన జాతకంలో ఉన్నాయని చెబుతున్నారు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్.

వేణు స్వామీ అనే మరో జ్యోతిష్యులు కూడా  2019 లో జ‌గ‌న్ సీఏం అవుతారన్నారు. ఆయన జాత‌కంలో రాజ‌యోగం ఉందని తెలిపారు. చంద్ర‌బాబు జాతకంలో గురుడు ప్ర‌భావం ఎక్కువ ఉండ‌డంతో అధికారానికి దూరం కావచ్చొనని కూడా తెలిపారు. జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ది ఆరుద్ర నక్షేత్రం .....చంద్ర‌బాబు ది పుష్య‌మీ న‌క్షత్రం దీంతో రాహుకాలంలో వ‌చ్చిన ఎన్నికల నోటిఫికేషన్ వ‌ల‌న చంద్రాబాబుకి ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉందన్నారు. జాతకరిత్యా చంద్రబాబుకు గెలుపు దగ్గరకు వెళ్లి ఓడిపోతారన్నారు. అయితే లోక్‌సభ ఫలితాలు మాత్రం చంద్రబాబుకు కాస్త అనుకూలంగా ఉంటాయన్నారు. ఏదీ ఏమైనా గెలుపోటములపై రాజకీయ నేతలు, విశ్లేషకులే కాదు... జ్యోతిష్యులు పండితులు కూడా రెండు వర్గాలుగా విడిపోయిమరీ అంచనాలు వేసేస్తున్నారు. ఎవరికి వారు కాబోయే సీఎం ఈయనే అంటూ ప్రకటించేస్తున్నారు.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...