తెలంగాణ టీడీపీపై చంద్రబాబు ఫోకస్... నిజమేనా ?

చంద్రబాబు నిజంగానే తెలంగాణ టీడీపీపై దృష్టి పెట్టే పరిస్థితులు ఉన్నాయా ? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

news18-telugu
Updated: August 29, 2019, 4:57 PM IST
తెలంగాణ టీడీపీపై చంద్రబాబు ఫోకస్... నిజమేనా ?
చంద్రబాబు (File)
  • Share this:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాలకే అంకితమైపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాలపై ఆయన దృష్టి పెట్టడం మానేసి చాలాకాలమైంది. అయితే ఉన్నట్టుండి ఆయన తెలంగాణ టీడీపీకి చెందిన శ్రేణులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు అమరావతిలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు... తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని వారితో వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే చంద్రబాబు నిజంగానే తెలంగాణ టీడీపీపై దృష్టి పెట్టే పరిస్థితులు ఉన్నాయా ? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఎవరెప్పుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో దృష్టి పెట్టడం సాధ్యంకాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో టీడీపీని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అత్యంత కష్టమైన బాధ్యత కూడా చంద్రబాబు మీదే ఉండటంతో... ఆయన తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయడం అంత ఈజీకాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా... తెలంగాణ టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసిన చంద్రబాబు అసలు వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

First published: August 29, 2019, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading