అలా చేయడం కరెక్టు కాదు.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

పెన్షన్‌ తీసుకునే వారంతా 60ఏళ్లు పైబడిన వారే కావడంతో.. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యల కారణగా వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ పూర్తి పించన్ అందజేయాలన్నారు చంద్రబాబు.

news18-telugu
Updated: April 22, 2020, 4:09 PM IST
అలా చేయడం కరెక్టు కాదు.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్న ఆయన.. తాజాగా విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లపై స్పందించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో పింఛను చెల్లించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. మార్చి నెలకు సంబంధించి వారికి సగం పెన్షనే చెల్లించడం సరికాదని అన్నారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల పట్ల ఈ తరహా వ్యవహరించడం సబబు కాదని విమర్శలు గుప్పించారు. వారికి పెన్షన్ వంద శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పెన్షన్‌ తీసుకునే వారంతా 60ఏళ్లు పైబడిన వారే కావడంతో.. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యల కారణగా వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ పూర్తి పించన్ అందజేయాలన్నారు చంద్రబాబు.

లాక్‌డౌన్ వల్ల రాబడి తగ్గిపోవడంతో అన్ని ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించాయి. ఏపీలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని రకాల ప్రజాప్రతినిధుల జీతాల్లో 100 శాతం జీతాల్లో కోత పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో 60 శాతం కోత విధించింది. ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వేతనాన్ని వాయిదా వేసింది. నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయినా, ఆయా ఉద్యోగులకు పై దామాషాలో పెన్షన్ అందజేస్తున్నారు. ఐతే కరోనా పోరాటంలో ముందున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులతో పాటు పారిశుధ్య సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాలని ఆ తర్వాత సీఎం జగన్ నిర్ణయించారు.
First published: April 22, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading