Home /News /politics /

CHANDRABABU NAIDU WRITES A LETTER TO AP DGP GAUTAM SAWANG ON LAW AND ORDER SITUATION IN THE STATE BA

డీజీపీ గారూ.. ఐ యామ్ సారీ టు సే.. గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు ఘాటు లేఖ

చంద్రబాబు నాయుడు, గౌతం సవాంగ్ (File Photo)

చంద్రబాబు నాయుడు, గౌతం సవాంగ్ (File Photo)

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

    ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఇటీవల చీరాలలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యాయత్నం, రాష్ట్రంలో శాంతి భద్రతలు, మీడియా గొంతును ప్రభుత్వం నొక్కుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందని ఆ లేఖలో ఆరోపించారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. ఆందోళన పరిచేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత దిగువ స్ధాయికి లా అండ్ ఆర్డర్ పడిపోయింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. గడిచిన మూడు, నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఓలను బెదిరించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశాయి. సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల మీద అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు. చీరాలలో సామాజిక కార్యకర్త నాగార్జున రెడ్డి మీద అధికార పార్టీ నేతలు దాడి చేశారు. ఆమంచి కుటుంబం మీద ప్రకాశం ఎస్పీకి ఫిర్యాదు చేసిన రోజే నాగార్జున రెడ్డి కిడ్నాప్‌నుకు గురయ్యాడు. ప్రస్తుతం నాగార్జున రెడ్డి ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

    డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు రాసిన లేఖ

    మరోవైపు అధికార పార్టీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీయేతరులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షాలకు చెందిన వారిపై మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సత్యమేవ జయతే అనే నినాదాన్ని అనుసరించి పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP DGP, Chandrababu naidu, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు