Home /News /politics /

CHANDRABABU NAIDU WILL EVENTUALLY ESCAPE FROM INDIA ALLEGES YSRCP MP VIJAYASAI REDDY

చంద్రబాబు దేశం విడిచి పారిపోతారు: విజయసాయిరెడ్డి

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)

ఆంధ్రప్రదేశ్‌లో దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో పంచుతున్నారని చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు గుప్పించారు.

    తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున ముమ్మర ప్రచారం చేస్తున్న చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పంచ్ పేల్చారు. ప్రజాకూటమిలో రాహుల్ గాంధీతో కలసి ప్రచారం చేసిన చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడికి ఏమేం నేర్పారో చూడండంటూ ఓ జాబితా ట్వీట్ చేశారు. ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లైయింగ్‌’ కు ఆదిగురువుగా ప్రసిద్ధి చెందిన చంద్రబాబు అబద్దాల జిమ్మిక్స్ స్కిల్స్‌ చూసి రాహుల్‌ బాబాకు దిమ్మతిరిగిపోయిందట. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ఓట్లను హోల్‌సేల్‌గా అత్యధిక రేట్లకు కొని ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చెయ్యొచో రాహుల్ బాబాకు నాయుడుబాబు ఉపదేశం చేశారట!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

    khammam sabha, rahul gandhi, chandrababu, ap politics
    ఖమ్మం సభలో రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)


    దీంతోపాటు ఏపీలో దోచుకొచ్చిన డబ్బులను తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ చేస్తున్నారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ‘పార్క్‌ హయత్‌లో జరిగిన బ్రేక్‌ ఫాస్ట్‌ భేటీలో నాయుడుబాబు ఛీటింగ్‌ కళకు అబ్బురపడిన రాహుల్‌ బాబా తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ మొత్తాన్ని బాబు చేతుల్లో పెట్టి పోయాడట. అందుకే బాబు హైదరాబాద్‌లోనే మకాం వేసి ఏపీలో దోచుకొచ్చిన నిధులతో నంద్యాల మోడల్‌ను ప్రయోగించే పనిలో పడ్డాడు.’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

    విజయసాయిరెడ్డి ట్వీట్
    విజయసాయిరెడ్డి ట్వీట్


    మరోవైపు చంద్రబాబునాయుడు దేశం విడిచి పారిపోతారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు అమరావతి భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. వ్యవసాయం అంటే తెలియని సింగపూర్‌కు అమరావతి రైతులను పంపడాన్ని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి పంటినొప్పి ట్రీట్ మెంట్‌ వెళతారని, మరొకరు హెయిర్ డైయింగ్ కోసం వెళ్తారని, అలాగే, ఇంకో మంత్రి ఇంట్లో ఫర్నిచర్ కోసం ప్రభుత్వ డబ్బుతో సింగపూర్ వెళ్తారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అక్రమ సంపాదన అంతా సింగపూర్‌కు తరలిపోతోందని అనుమానం వ్యక్తం చేశారు.



    తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తుండడంతో ప్రజాకూటమిపై విజయసాయిరెడ్డి వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: AP Politics, Chandrababu naidu, Tdp, Vijayasai reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు