వారం రోజుల్లో ఇద్దరు శివప్రసాద్‌లు మరణంపై చంద్రబాబు స్పందన..

నారమల్లి శివప్రసాద్, కోడెల శివప్రసాద్ (File)

కోడెల శివప్రసాద్, నారమల్లి శివప్రసాద్ ఇద్దరూ టీడీపీలో కీలక నేతలే. కోడెల ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నారమల్లి శివప్రసాద్ కూడా ఓసారి మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా సేవలు అందించారు.

  • Share this:
    చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ (68) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యతో కొన్నాళ్లుగా బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 16నే టీడీపీ మరో సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు నేతలు చనిపోవడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ‘నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు.’ అని ట్వీట్ చేశారు. అనంతరం ‘శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు.’ అని మరో ట్వీట్ చేశారు.    కోడెల శివప్రసాద్, నారమల్లి శివప్రసాద్ ఇద్దరూ టీడీపీలో కీలక నేతలే. కోడెల ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. శివప్రసాద్ కూడా ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలు అందించారు. రెండుసార్లు చిత్తూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 నుంచి 2019 మధ్య ఏపీకి ప్రత్యేక హోదా కోసం శివప్రసాద్ పలురకాలుగా విచిత్ర వేషధారణల్లో నిరసనలు తెలిపారు.
    First published: