బాల్య నేస్తమా.. అందుకో నా వీడ్కోలు.. శివప్రసాద్‌తో చంద్రబాబు చిన్నప్పటి ఫొటో

Sivaprasad Death | చంద్రబాబు, శివప్రసాద్ బాల్యస్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఒకే క్లాస్ స్టూడెంట్స్.

news18-telugu
Updated: September 22, 2019, 2:08 PM IST
బాల్య నేస్తమా.. అందుకో నా వీడ్కోలు.. శివప్రసాద్‌తో చంద్రబాబు చిన్నప్పటి ఫొటో
శివప్రసాద్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబునాయుడు
  • Share this:
చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ (68) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యతో కొన్నాళ్లుగా బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ నటుడిగానే కాకుండా ఎంపీగా కూడా ప్రజలకు సుపరిచితులు. తన నటనతో సినిమాల్లోనూ, తన విచిత్ర వేషధారణలతో రాజకీయాల్లోనూ పేరు పొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ 1999-2004 మధ్య సమాచార శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2009, 2014లో రెండుసార్లు చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో శివప్రసాద్‌కు మంచి అనుబంధం ఉంది.

చంద్రబాబు, శివప్రసాద్ బాల్యస్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఒకే క్లాస్ స్టూడెంట్స్. చదువు పూర్తయిన తర్వాత చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వెళ్లారు. శివప్రసాద్ వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత నటన మీద ఉన్న ఇష్టంతో సినిమాల్లో కూడా మెరిశారు. చంద్రబాబునాయుడి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. మధ్యలో చంద్రబాబుతో కొన్ని అంశాల్లో విబేధించినా, టీడీపీని మాత్రం వీడలేదు. తన బాల్యమిత్రుడి ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు కూడా చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. శివప్రసాద్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>