ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రయాణం... డేట్ ఫిక్స్

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 10:41 PM IST
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రయాణం... డేట్ ఫిక్స్
నారా చంద్రబాబునాయుడు (File)
  • Share this:
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఈనెల 25వ తేదీ సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారని తెలిసింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు అనుమతి కోరారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులను పరామర్శించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమరావతి వెళ్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తెలంగాణ డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కూడా ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు అనుమతి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఏపీ నుంచి కూడా అనుమతి వస్తే సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. మార్చి 20 నుంచి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత వరుసగా లాక్ డౌన్‌ను కొనసాగించడంతో చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంటికే పరిమితం అయ్యారు.

First published: May 23, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading