ఏపీకి చంద్రబాబు... ముంపుప్రాంతాల్లో పర్యటన

కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిండి భారీగా వరద నీరు రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి చేరింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక దశలో దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు.

news18-telugu
Updated: August 20, 2019, 8:28 AM IST
ఏపీకి చంద్రబాబు... ముంపుప్రాంతాల్లో పర్యటన
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
కరకట్టపై వరద నీరు చేరడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న టీడీజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి పయనమయ్యారు. కృష్ణా జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిండి భారీగా వరద నీరు రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి చేరింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక దశలో దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో 46గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంటలకు ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. తీవ్ర అవస్థల పాలైన ప్రజలను పంట నష్టపోయిన రైతుల్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

కృష్ణానదికి భారీగా వరద నీరు చేరడంతో కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటివరకు వరదనీరు చేరింది. దీంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వరదను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యిందని ఆరోపించారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు