జేడీఎస్‌కు మద్దతుగా నేటి నుంచి కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం..

Chandrababu Naidu to campaign for JDS in Karnataka : నేటి ఉదయం కర్ణాటక వెళ్లనున్న చంద్రబాబు.. తొలుత మండ్యాలో ప్రచారం నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: April 15, 2019, 5:25 AM IST
జేడీఎస్‌కు మద్దతుగా నేటి నుంచి కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం..
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీలకు ప్రచారం చేయబోతున్నారు. ఇటీవల జేడీఎస్ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని దేవెగౌడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో.. ఇప్పుడు చంద్రబాబు కూడా కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నేటి ఉదయం కర్ణాటక వెళ్లనున్న చంద్రబాబు.. తొలుత మండ్యాలో ప్రచారం నిర్వహించనున్నారు.

కాగా, దక్షిణాదిలో బీజేపీకి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకే. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో కర్ణాటకలో బీజేపీ 18 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 10, జేడీఎస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే గతేడాది జరిగిన రాజస్తాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మోదీ గ్రాఫ్ పడిపోయిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఈసారి బీజేపీ గాలి ఎంతవరకు వీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటి ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించాలనుకుంటోంది. అటు కాంగ్రెస్-జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నందునా.. ఈసారి బీజేపీని నిలువరించవచ్చునని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
First published: April 15, 2019, 5:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading