ఏపీలో నారాసురుడి పాలన... బాబు బినామీ కంపెనీల్లో ప్రజల డేటా ఉందన్న వైఎస్ జగన్

YS Jagan Comments on Chandrababu Naidu | టీడీపీ సేవా మిత్ర యాప్‌తో ఓట్లను తొలగించడం, నమోదు చేయడం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడటంతో... ఇది మా డేటా అని చంద్రబాబు బుకాయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు... క్షమాపణ చెప్పకుండా దొంగ దొంగ అని అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: March 5, 2019, 4:06 PM IST
ఏపీలో నారాసురుడి పాలన... బాబు బినామీ కంపెనీల్లో ప్రజల డేటా ఉందన్న వైఎస్ జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో నారాసురుడి పాలన కొనసాగుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో పాల్గొన్న వైఎస్ జగన్... టీడీపీ సేవా మిత్ర యాప్‌తో ఓట్లను తొలగించడం, నమోదు చేయడం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడటంతో... ఇది మా డేటా అని చంద్రబాబు బుకాయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు... క్షమాపణ చెప్పకుండా దొంగ దొంగ అని అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంబంధించిన డేటా బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తే చంద్రబాబు దగ్గర సమాధానం లేదని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చంద్రబాబుకు చెందిన ప్రైవేటు సంస్థల వద్ద దొరుకుతుందంటే... అది ఎంత పెద్ద నేరమో ఆలోచించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. చివరకు తన సొంత చిన్నాన్న ఓటును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి డేటా చంద్రబాబు కంపెనీల దగ్గర ఉన్నాయంటే...వ్యవస్థలను ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజల బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నంబర్లు చంద్రబాబు వద్ద ఉన్నాయని ధ్వజమెత్తారు. తమ పోలీసులను తెలంగాణ పంపించి వాచ్‌మన్‌ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారని జగన్ అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను తానే చంపేసిన చంద్రబాబు... ఇప్పుడు నల్లచొక్కాలతో నిరసనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు.

First published: March 5, 2019, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading