టీడీపీ నేతల అరెస్టులకు నిరసనగా కాగడా పట్టిన చంద్రబాబు...

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మరికొందరు నాయకులు కాగడాల ప్రదర్శన చేశారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మరికొందరు నాయకులు కాగడాల ప్రదర్శన చేశారు. అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేతలు బోండా ఉమా, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, మరికొందరు నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. అలాగే, మరికొందరు పార్టీ నేతలు గల్లా జయదేవ్, దేవినేని ఉమా, మాగంటి బాబు తదితరులు తమ తమ ఇళ్ల వద్దే కాగడాల ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్టులను ఖండించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . వైసీపీ ప్రభుత్వ ప్రలోభాలకు లొంగని వారిని జగన్ సర్కారు తప్పుడు కేసులు పెడుతూ అరెస్టు చేస్తోందంటూ మండిపడ్డారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందని, ఆ చీకటి ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే వెలుగు వస్తుందని తెలియజెప్పేందుకు సింబాలిక్‌గా ఈ కాగడాల ప్రదర్శన చేపట్టారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: