CID Notice to Chandrababu: చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి...? అలా అయితే అరెస్ట్ తప్పదా..?

చంద్రబాబు, అమరావతి లోగో, నారాయణ

రాజధాని భూముల (Amaravathi Lands) వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి (Nara Chandababu Naidu) సీఐడీ (AP CID) నోటీసులు జారీ అవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

  • Share this:
    రాజధాని భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు జారీ అవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఐడీ నుంచి నోటీసులు తీసుకున్నట్లు చంద్రబాబు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు సీఐడీ నోటీసులు అందుకున్న వెంటనే న్యాయనిపుణులు ఆయన ఇంటికి చేరుకున్నారు. సీఐడీ నోటీసులు అందుకున్నందున కోర్టుకు వెళ్లాలా..? లేక విచారణకు హాజరుకావాలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు ఇచ్చిన ప్రకారం చంద్రబాబు తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాలని న్యాయనిపుణులు చెప్తున్నారు. హాజరుకాని పక్షంలో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.

    ఐతే న్యాయనిపుణులతో చర్చ సందర్భంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే చర్చ కూడా వచ్చినట్లు సమాచారం. పైగా విచారణకు విజయవాడ వస్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముందడటంతో చంద్రబాబు కూడా స్టే తెచ్చుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ఇన్ సైడర్ ట్రైడింగ్ కేసు కాకుండా.. కొత్తగా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అసెన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. వీళ్లిద్దరితో పాటు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న కాంతిలాల్ దండేకు నోటీసులు ఇచ్చారు. భూ రికార్డులపై ఆయన్ను కూడా విచారించే అవకాశముంది.

    ఇది చదవండి: ఆ 500 ఎకరాలే కీలకం.., చంద్రబాబు అంతపెద్ద తప్పు చేశారా..?



    రాజధాని ప్రకటన సమయంలో అక్రమంగా బదలాయింపుకు జరిగిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ చేర్చడంతో పాటు వాటికి సాధారణ భూములకు ఇచ్చే పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ అనుమతి లేకుండానే జీవో జారీ చేసినట్లు ఆరోపలున్నాయి. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పేదల దగ్గర అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ లో అత్యధిక ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. ఇలా ప్రయోజనం పొందినవారు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published: