యుద్ధం కాదు... భవిష్యత్తు కోసం పోరాటమన్న చంద్రబాబు

రైతులు త్యాగాలు చేసి రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారని... వారు త్యాగం చేయకపోతే రాజధాని వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు.

news18-telugu
Updated: November 28, 2019, 6:25 PM IST
యుద్ధం కాదు... భవిష్యత్తు కోసం పోరాటమన్న చంద్రబాబు
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
అమరావతి ఏ ఒక్క సామాజికవర్గం కోసమో కాదని... రాష్ట్ర ప్రజలందరి కోసమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్ కోసం పోరాడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. నేడు అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజా రాజధానిని సందర్శించడానికి వచ్చానని.. యుద్ధం చేయడానికి రాలేదని చంద్రబాబు తెలిపారు. రైతులు త్యాగాలు చేసి రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారని... వారు త్యాగం చేయకపోతే రాజధాని వచ్చేది కాదని అన్నారు. తాను ఇచ్చిన ఒక్క పిలుపుతో రైతులు ముందుకొచ్చి భూమి ఇచ్చారని చంద్రబాబు అన్నారు.

వరల్డ్‌క్లాస్‌ సిటీగా రాజధానిని తయారు చేస్తామని చెప్పామని తెలిపారు. రాజధాని విషయంలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే ఇక్కడికి వచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ రౌడీలను పంపించి దాడులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. డీఎస్పీ సమక్షంలోనే రాళ్లు, చెప్పులు విసిరారన్నారు. రాజధానిపై వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే పనిచేశానని చంద్రబాబు స్పష్టం చేశారు.


First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>