12 గంటల దీక్షకు రూ.10 కోట్లు...చంద్రబాబు దీక్షపై రాజకీయ దుమారం

ఏపీ నుంచి ఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. కార్యకర్తల్ని, టీడీపీ శ్రేణుల్ని పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలించేందుకు చంద్రబాబు రైల్వే నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అద్దెకు తీసుకున్నారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 4:49 PM IST
12 గంటల దీక్షకు రూ.10 కోట్లు...చంద్రబాబు దీక్షపై రాజకీయ దుమారం
చంద్రబాబుకు నిమ్మరసం తాగిస్తున్న దేవెగౌడ
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 4:49 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేసి 24 గంటలు గడవకముందు రాజకీయ దుమారం చెలరేగుతుంది. హస్తిన వేదికగా చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఏపీ సీఎం కోట్లలో ఖర్చు పెట్టారు. 12 గంటల దీక్ష కోసం అక్షరాల రూ.10 కోట్ల రూపాయల్ని చంద్రబాబు ఖర్చు చేశారు. ఏపీ నుంచి ఢిల్లీకి రెండు ట్రైన్‌లను బుక్ చేశారు. కార్యకర్తల్ని, టీడీపీ శ్రేణుల్ని పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలించేందుకు బాబు రైల్వే నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అద్దెకు తీసుకున్నాయి. దీనికోసం రూ. కోటి 12 లక్షల రూపాయల్ని వెచ్చించారు.

చంద్రబాబు దీక్షకు తరలివచ్చిన జనం


అంతేకాకుండా ఢిల్లీకి వచ్చిన వారందరి కోసం పెద్ద ఎత్తున హోటళ్లలో రూంలను కూడా బుక్ చేశారు. సుమారు ఢిల్లీలో 1100 రూమ్‌లను చంద్రబాబు దీక్షకు వచ్చిన వారి కోసం బుక్ చేశారు. అంతేకాకుండా కార్యకర్తల్ని తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారి కోసం భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిన్నంటి కోసం అక్షరాల రూ.10 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ప్రభుత్వ జీవోలో తెలిపింది.రాష్ట్ర ఖజానా నుంచి పదికోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఇచ్చిన జీవో కాపీ న్యూస్ 18 చేతికి చిక్కింది.

delhi chandrababu protest
చంద్రబాబు దీక్ష ఖర్చుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో
చంద్రబాబు దీక్షకు కోట్లలో ఖర్చు చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడెప్పుడో తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేసినందుకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని ఖజానా నుంచి ఖర్చు పెట్టించారని చంద్రబాబుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు చేసే ఖర్చు కాస్త తక్కువే అంటున్నారు. బీజేపీతో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు చంద్రబాబు చేసిన ఖర్చుపైనే విమర్శనస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును తీసుకొచ్చి చంద్రబాబు అప్పనంగా ఖర్చ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. మరి ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలని చంద్రబాబు ఏ విధంగా తిప్పికొడతారో వేచి చూడాలి.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...