ఏసీబీ, అట్రాసిటీ, నిర్భయ అయిపోయాయి.. ఇక మర్డర్ కేసులా?.. చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నేతల మీద అధికార వైసీపీ ఏసీబీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు పెట్టడం అయిపోయిందని, ఇప్పుడు ఏకంగా మర్డర్ కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

news18-telugu
Updated: July 3, 2020, 4:50 PM IST
ఏసీబీ, అట్రాసిటీ, నిర్భయ అయిపోయాయి.. ఇక మర్డర్ కేసులా?.. చంద్రబాబు
చంద్రబాబు నాయుడు
  • Share this:
తెలుగుదేశం పార్టీ నేతల మీద అధికార వైసీపీ ఏసీబీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు పెట్టడం అయిపోయిందని, ఇప్పుడు ఏకంగా మర్డర్ కేసులు పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపిస్తూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు స్పందించారు. ‘ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి. ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు. పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు?. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు. బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే వైసీపీ మంత్రులు దాడి చేసారు. ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్యకేసు బనాయిస్తారా? ఏమిటీ ఉన్మాదం? మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా? మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా?’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపించారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు సోదా చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. మాజీ మంత్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
First published: July 3, 2020, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading