Chandrababu Naidu: ఓర్వలేకపోతున్న జగన్.. పీవీకి పోటీ పెట్టలేదన్న చంద్రబాబు

Chandrababu Naidu: ఒక తెలుగువాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అవుతుంటే జగన్ ఓర్వలేక పోతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.

news18-telugu
Updated: October 16, 2020, 8:38 PM IST
Chandrababu Naidu: ఓర్వలేకపోతున్న జగన్.. పీవీకి పోటీ పెట్టలేదన్న చంద్రబాబు
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
న్యాయవ్యవస్థపై దాడికి వైసీపీ తెగబడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఒక తెలుగువాడికి వస్తుంటే జగన్ ఓర్వ లేక పోతున్నాడని అన్నారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో నిర్వహించిన సమీక్షలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రి పదవిని అలంకరించారని... వారందరూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. కానీ జగన్ మాత్రం తెలుగువారికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలుగువాడు పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు పోటీపెట్టకుండా టీడీపీ గౌరవించిందని.. స్వచ్ఛందంగా ఎన్నికల నుంచి తప్పుకుందని చంద్రబాబు అన్నారు. నేడు ఒక తెలుగువాడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అవుతుంటే జగన్ ఓర్వలేక పోతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లోపిస్తే ఎలా ఉంటుందో నిన్న విజయవాడలో జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. సైకోల పాలనలో సైకోలు స్వైర విహారం చేస్తున్నారని మండిపడ్డారు. దిశ చట్టం తీసుకొచ్చామని వైసీపీ వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారని... లేని చట్టానికి పోలీస్ స్టేషన్లు, లేని చట్టానికి సమీక్షలు, ఏడాదిన్నరగా అనేక డ్రామాలు చేశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఫేక్ ముఖ్యమంత్రి.. ఫేక్ పార్టీ.. ఫేక్ పరిపాలనగా రాష్ట్రాన్ని మార్చారని ధ్వజమెత్తారు. నిర్భయ చట్టంతోనే మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టవచ్చునని చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోలేదని అన్నారు. దిశ చట్టానికి మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపిందని చంద్రబాబు తెలిపారు.

andhra pradesh,ap news,ap political news,sajjala rama krsihan reddy,ap universities administrative councils,ఆంధ్రప్రదేశ్,ఏపీ వార్తలు,ఏపీ యూనివర్సిటీల్లో పాలకమండలి నియామకాలు,సజ్జల రామకృష్ణారెడ్డి,sajjala rama krishna reddy,
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్


రాష్ట్రంలో రైతులను అప్పులపాలు చేశారని.. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పనితీరు, ఇప్పుడు వైసీపీ పనితీరుపై ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఏం చేసింది. ఇప్పుడు బాధ్యతాయుతమైన పార్టీగా టీడీపీ ప్రజలకు ఎలా అండగా ఉందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనాలో, వరద విపత్తులలో వైసీపీ వైఫల్యాలను ఎండగట్టాలని అన్నారు. రాజధాని మార్చబోమని నాడు ఎన్నికల హామీగా చెప్పిన జగన్ నేడు ప్రజలను మోసం చేస్తూ మూడు ముక్కల రాజధాని ఆట ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు కట్టు బానిసలు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని... తమ పదవులను కాపాడుకునేందుకు అర్రులు చాస్తున్నారుని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు పెట్రేగిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఐదు లక్షలున్న ఎకరం పొలాన్ని రూ.15 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించి రెండున్నర రెట్లు అధికంగా ఎకరంను దాదాపు రూ.45 లక్షలకు ప్రభుత్వానికి అమ్ముకుని వైకాపా నాయకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ఆయారాం, గయారాంలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదని చంద్రబాబు అన్నారు. అవకాశవాద రాజకీయాలతో కొందరు నాయకులు పార్టీని వదిలివెళ్లినా కార్యకర్తలే టీడీపీకి కంచుకోట. 40 ఏళ్లుగా జెండా మోసే కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 16, 2020, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading