ఉన్మాది సీఎం.. రౌడీ మంత్రులు.. వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

మండలిలో ఎమ్మెల్సీలు ప్రలోభాలకు గురిచేశారని.. ఛైర్మన్‌ షరీఫ్‌పై దాడికి యత్నించారని ఆరోపించారు. మీరు చెప్పినట్లు వినకుంటే మండలిని రద్దుచేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.


Updated: January 24, 2020, 3:43 PM IST
ఉన్మాది సీఎం.. రౌడీ మంత్రులు.. వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం
చంద్రబాబునాయుడు
  • Share this:
బుధవారం ఏపీ శాసనమండలిలో నెలకొన్న పరిణామాలు, మండలిని రద్దు చేస్తారన్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చట్టసభల్లో సీఎం జగన్ ఉన్మాదిలా,మంత్రులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. మండలిలో ఎమ్మెల్సీలు ప్రలోభాలకు గురిచేశారని.. ఛైర్మన్‌ షరీఫ్‌పై దాడికి యత్నించారని ఆరోపించారు. మీరు చెప్పినట్లు వినకుంటే మండలిని రద్దుచేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.


వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. శాసనసభలో బిల్లుపై మాట్లాడేందుకు కనీసం మాకు సమయం ఇవ్వలేదు. ప్రభుత్వం నీచమైన రాజకీయాలకు పాల్పడింది. సభలో మొదటిరోజు మొత్తం నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. స్పీకర్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రతిపక్షాన్ని బయటకు నెట్టామన్నారు. ఉన్మాది ముఖ్యమంత్రి దుర్మార్గంగా ప్రవర్తించారు. లైవ్‌ కట్ చేసి టీవీ ప్రసారాలు ఎందుకు నిలిపివేసారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో కూడా ఇంత అరాచకం చూడలేదు.
చంద్రబాబు
''కౌన్సిల్‌లో 22 మంది మంత్రులు ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారు. సభలో లైవ్ ప్రసారాలు, టీవీలు కట్ చేశారు. కౌన్సిల్ గ్యాలేరీలో కూర్చుంటే నన్ను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. కౌన్సిల్ చైర్మన్‌ను బూతులు తిట్టారు. ఆయన రూంలో కొట్టేందుకు ప్రయత్నించారు. గూండాలు,బజారు రౌడీలుగా వ్యవహరించారు. రౌడీల్లా ప్రవర్తిస్తే మేము సరెండర్ అయిపోవాలా. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుంది. మీరు చెప్పినట్లు వినకుంటే మండలి రద్దు చేస్తారా?'' అని చంద్రబాబు అన్నారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు