జే ట్యాక్స్‌తో దోపిడీ.. కంటి వెలుగు కాపీ.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

గ్రామ సచివాలయాలకు, పంచాయితీ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం ఏమిటని ప్రశ్నించారు.


Updated: October 9, 2019, 7:50 PM IST
జే ట్యాక్స్‌తో దోపిడీ.. కంటి వెలుగు కాపీ.. జగన్‌పై చంద్రబాబు ఫైర్
జగన్, చంద్రబాబు

Updated: October 9, 2019, 7:50 PM IST
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 10న అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే, ఆ కంటి వెలుగు పథకం టీడీపీదేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గుంటూరులో టీడీపీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. కంటి వెలుగు అనేది మరో జగన్మాయ అని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో పథకాన్ని పేరు మార్చి ప్రజలను ఏమారుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 13జిల్లాలలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టి 67లక్షల మందికి ఉచిత చికిత్స జరిపారు. 3లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు దానినే ‘కంటి వెలుగు’గా మార్చి ప్రజల కళ్లు గప్పాలని చూడటం దివాలాకోరుతనమని మండిపడ్డారు.

ఆటోలకు పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది పోటిపడి జగన్ స్టిక్కర్లు అతికించడం నవ్వుల పాలైంది. రవాణా శాఖ, పోలీసుల అత్యుత్సాహాన్ని ఖండిస్తున్నాం. ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న భూమా అఖిలప్రియను అణగదొక్కడానికే ఆమె భర్త భార్గవ రామ్ పై తప్పుడు కేసులు పెట్టారు. జగన్ ట్యాక్స్ విధించి మద్యం ధరలు పెంచేశారు. చివరికి తాగుబోతులను కూడా వదలకుండా జలగల్లా పీలుస్తున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ నియామకాలన్నీ పెద్ద గోల్ మాల్ గా తయారైంది.
చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత


వైసిపి నేతల బెదిరింపులతో ప్రైవేటు రంగంలో ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. గ్రామ సచివాలయాలకు, పంచాయితీ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి నేతలపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.SBI Good News | హోమ్ లోన్స్‌పై వడ్డీ తగ్గింపు.. కస్టమర్లకు పండగే

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...