జగన్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

news18-telugu
Updated: August 9, 2019, 5:37 PM IST
జగన్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా కొందరు గిరిజనులు చంద్రబాబునాయుడును కలిశారు. వారితో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు సీఎం జగన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మా నాన్న వల్ల కియా వచ్చిందని జగన్ చెప్పడం దారుణం. అధికారమదంతో విర్రవీగుతున్నారు. జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు. వైఎస్, నేను పరస్పరం గౌరవించుకునేవాళ్లం. జగన్ మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.’ అని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలపై వైసీపీ దాడులు ఆపకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆదివాసీలు, గిరిజనులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>