జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి వెయ్యిరెట్లు బెటర్... చంద్రబాబు వ్యాఖ్య

డీజీపీ ఆఫీస్‌ను వైసీపీ కార్యాలయంగా మార్చారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే... డీజీపీ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 18, 2019, 1:41 PM IST
జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి వెయ్యిరెట్లు బెటర్... చంద్రబాబు వ్యాఖ్య
వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఫైల్
news18-telugu
Updated: October 18, 2019, 1:41 PM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డికి పట్టు విడుపులు ఉండేవన్న చంద్రబాబు... జగన్‌తో పోలిస్తే రాజశేఖర్ రెడ్డి వెయ్యిరెట్లు బెటర్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్‌ హుందాతనంగా వ్యవహరించేవారని చంద్రబాబు అన్నారు. ఏదైనా విషయం తప్పు అని చెబితే రాజశేఖర్ రెడ్డి వినేవారని... వెనక్కి తగ్గేవారని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. మీడియాపై ఆంక్షల విషయంలో సీఎం జగన్ చంద్రబాబు వెనక్కి తగ్గాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో అదే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందని అన్నారు.

డీజీపీ ఆఫీస్‌ను వైసీపీ కార్యాలయంగా మార్చారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెళితే... డీజీపీ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. డీజీపీ ఎందుకు సహనం కోల్పోతున్నారో అర్థంకావడం లేదని చంద్రబాబు అన్నారు. తనకు నోటీసులు ఇస్తానని డీజీపీ అనడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవకుండానే ఎన్నో అరాచకాలు చేశారని నిప్పులు చెరిగారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రశ్నాపత్రాన్ని టైప్ చేసిన వారికే మొదటి ర్యాంక్ వచ్చిందని, ప్రభుత్వ అక్రమాలపై ఇంతకన్నా రుజువేం కావాలని ప్రశ్నించారు.

కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరీక్షలు రాయవద్దని తాను చెప్పడం లేదని, కానీ, వారికే మొదటి ర్యాంక్ రావడం వెనుక ఎంత కుట్ర దాగుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...