దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరోసారి కొనసాగుతుందని, మోదీ మళ్లీ పీఎం అవుతారంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలం అయ్యాయని చంద్రబాబు అన్నారు. ‘ప్రజల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు విఫలం అయ్యాయి. వాస్తవ పరిస్థితికి దూరంగా, భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, ఎలాంటి అనుమానం లేకుండా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కేంద్రంలో కూడా బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని నమ్మకంతో ఉన్నాం.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు ఫలితాల్లో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కబెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల ఫలితాలు మొదలవ్వకముందే ఐదు అసెంబ్లీ పోలింగ్ బూత్‌ల్లోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్క బెట్టాలని, అలా కాకుండా మరోలా వ్యవహరిస్తే అన్ని అసెంబ్లీల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు.
Time and again exit polls have failed to catch the People's pulse. Exit polls have proved to be incorrect and far from ground reality in many instances. While undoubtedly TDP govt will be formed in AP, we are confident that non-BJP parties will form a non-BJP govt at the center.
— N Chandrababu Naidu (@ncbn) May 19, 2019
ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని లగడపాటి రాజగోపాల్ సర్వేలో వచ్చింది. ఇండియాటుడే సర్వేలో మాత్రం వైసీపీదే విజయం అని లెక్కలు వచ్చాయి. వీడీపీ అసోసియేట్స్, సీపీఎస్ సర్వేలు కూడా వైసీపీకి పట్టం కట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.