అమరావతి తరలింపునకు చట్టపరమైన అడ్డంకులున్నాయ్... చంద్రబాబు

రైతుల కోసం కేంద్రం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా రద్దు చేసిందని, రాజధానికి డబ్బులిచ్చారని, ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 5, 2020, 6:01 PM IST
అమరావతి తరలింపునకు చట్టపరమైన అడ్డంకులున్నాయ్... చంద్రబాబు
చంద్రబాబు, అమరావతి
  • Share this:
అమరావతి రాజధానిని తరలించడానికి చట్టపరమైన సమస్యలు ఉన్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరిన చంద్రబాబు.. 48 గంటలు గడువు ముగిసిన తర్వాత మరోసారి జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌కు మళ్లీ చెబుతున్నా. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయండి. ప్రజలు మీకు ఓట్లేస్తే మేం సైలెంట్‌గా ఉంటాం. అమరావతి తరలించడానికి కుదరదు. రైతులకు ఎంఓయూ చేశాం. అగ్రిమెంట్ చేశాం. రైతుల నమ్మకాన్ని కాపాడాలి. రాజధాని తరలించాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ రెండు రోజుల్లో బయటపెడతా.’ అని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులు కోర్టుకు వెళితే న్యాయస్థానం స్టే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు రాజధానిని తరలించబోమని వైసీపీ నేతలు చెప్పిన వీడియోలు, అదే నేతలు మళ్లీ మాట మార్చారంటూ తాజాగా మాట్లాడిన వీడియోలను చంద్రబాబు జూమ్ యాప్‌లో ప్రదర్శించారు. అందులో జగన్ అసెంబ్లీలో అప్పుడు, ఇప్పుడు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి.

అమరావతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రైతుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్నారు. రైతుల కోసం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా రద్దు చేసిందని, రాజధానికి డబ్బులిచ్చారని, ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఆర్డర్‌తో హైకోర్టును ఏర్పాటు చేశారని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారని చంద్రబాబు అన్నారు. అలాంటిదాన్ని జగన్ మార్చేస్తారా అని ప్రశ్నించారు. ఈ పోరాటం తన కోసం , తన కుటుంబం, పార్టీ కోసం కాదని చంద్రబాబు అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading