చంద్రబాబుకు ఇంకా విషయం అర్థంకావడం లేదా ?

టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తనకు అర్థంకావడం లేదని పలుసార్లు వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రజలకు ఏం కావాలో అన్నీ చేశామని... అయినా ఎందుకు ఓడిపోయామని పార్టీ నేతలను కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 7, 2019, 6:37 PM IST
చంద్రబాబుకు ఇంకా విషయం అర్థంకావడం లేదా ?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒకసారి ఓడిపోయిన నాయకులు, పార్టీలు మళ్లీ అధికారంలోకి రావడం కూడా సర్వసాధారణం. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు తమ ఓటమిపై విశ్లేషించుకుని కారణాలు తెలుసుకోవడం... వాటిని సరిచేసుకోవడం వంటివి చేస్తుంటాయి. ఈ విషయంలో నేతలెవరూ పెద్దగా భేషజాలకు వెళ్లరు. పలు కారణాల వల్లే తాము అధికారం కోల్పోయామని పార్టీల అధినేతలు బహిరంగంగానే చెబుతుంటారు. కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తనకు అర్థంకావడం లేదని పలుసార్లు వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రజలకు ఏం కావాలో అన్నీ చేశామని... అయినా ఎందుకు ఓడిపోయామని పార్టీ నేతలను కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా మరోసారి చంద్రబాబు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన వేమూరు పార్టీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబు... 23 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచేంత తప్పు తానేమీ చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకుని... వాటిని సరి చేసుకోవాల్సిన పార్టీ అధినేతకు ఇంకా ఓటమికి కారణం తెలియకపోవడం ఏంటని పలువురు అభిప్రాయడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు పూర్తవుతున్నా... చంద్రబాబు మళ్లీ మళ్లీ అదే రకమైన వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలను, స్థానిక నేతలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని చంద్రబాబు ఇంకా గుర్తించడం లేదేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading