టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో హిందువులే పని చేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్యమతస్థులపై మాట్లాడినందుకే ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల వివాదంపై చంద్రబాబుతో పలువురు నేతల భేటీ అయ్యారు. రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు... పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించారు.
ఏపీ సీఎస్ బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి సీఎస్‌ను తప్పించే అధికారం ఉన్నప్పటికీ... ఈ తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అన్నారు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమనం అయితే ఇంకా మరీ దారుణం అని కామెంట్ చేశారు. తాజాగా చంద్రబాబు కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.