‘ఇది జస్ట్ ట్రైలరే’... సీఎం జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు వీడియో...

సీఎం జగన్ ఏడాది పాలనపై చంద్రబాబునాయుడు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: May 29, 2020, 10:23 PM IST
‘ఇది జస్ట్ ట్రైలరే’... సీఎం జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు వీడియో...
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 30వ తేదీతో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఓ వైపు మన పాలన మీ సూచన పేరుతో టీడీపీ హయాంలో పాలనకు, జగన్ జమానాలో పాలనకు పోలుస్తూ పలు ప్రకటనలు జారీ చేస్తోంది. ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో విపక్ష తెలుగుదేశం పార్టీ జగన్ ఏడాది పాలనపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ..’ అంటూ కామెంట్ చేశారు. దీనికి అనుంబంధంగా మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో జగన్ పాలన మీద నిప్పులు చెరిగార.

First published: May 29, 2020, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading