అమరావతిలో చంద్రబాబుకు ఇల్లు లేదా ? హైదరాబాద్ వచ్చేస్తారా ?

ఐదేళ్ల పాటు నవ్యాంధ్ర తొలి సీఎంగా రాజ్యపాలన చేసిన చంద్రబాబు... విభజన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ నుంచే పాలన కార్యక్రమాలు చేపట్టారు.

news18-telugu
Updated: May 31, 2019, 10:23 AM IST
అమరావతిలో చంద్రబాబుకు ఇల్లు లేదా ? హైదరాబాద్ వచ్చేస్తారా ?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 31, 2019, 10:23 AM IST
తాజా మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో కష్టం వచ్చిపడింది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమితో పుట్టెడు దుఖ:లో ఉన్న చంద్రబాబుకు... మరో పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటివరకు తాను అమరావతిలో నివాసం ఉంటున్న ఇంటిని వదిలే పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల పాటు నవ్యాంధ్ర తొలి సీఎంగా రాజ్యపాలన చేసిన చంద్రబాబు... విభజన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ నుంచే పాలన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 2015లో ఓటుకు నోటుకు కేసు తెరపైకి రావడంతో... తెలంగాణ నుంచి మకాం మార్చారు. ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి క్రిష్ణానది కరకట్ట మీద నిర్మించిన భవనాన్ని అధికార నివాసంగా చేసుకుని సీఎంగా పాలన చేస్తూ వచ్చారు చంద్రబాబు.

మరి ఇపుడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూడటంతో బాబు మాజీ సీఎం అయిపోయారు. దాంతో ఆయన ప్రస్తుతం నివాసం ఉండే ఇళ్లు కూడా ఆయనకు లేకుండా పోతుంది. ప్రస్తుతం ఏపీ కొత్త ముఖ్యమంత్రి జగన్ కి అది అధికార నివాసం అవుతుంది. అయితే జగన్ తనకంటూ తాడేపల్లిలో విశాలంగా ఇల్లు నిర్మించుకుని అక్కడే క్యాం ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో జగన్ ఉడవల్లిలో ఉన్న ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అదీ కాక... ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ నిర్మాణం అని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది.

ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేసిన వెంటనే కూల్చేందుకు కూడా ఆదేశాలు ఇస్తారని సమాచారం. దీంతో పాటు క్రిష్ణా నది మీద అక్రమ కట్టడాలు ఏవి వున్నా కూల్చేసేందుకు వైసీపీ సర్కార్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.ఏపీ ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబుకు ఇపుడు ఇల్లు అంటూ అమరావతిలో సొంతంగా లేదు. మరి చంద్రబాబు సొంత ఇల్లు కట్టించుకుంటారా లేక హైదరాబాద్‌కు వెళ్లి పార్టీ కార్యకలాపాలు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...