‘హైదరాబాద్‌లో కూర్చుని కబుర్లు చెబుతున్న చంద్రబాబు’ కామెంట్లపై టీడీపీ చీఫ్ రియాక్షన్

చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని కబుర్లు చెబుతున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై టీడీపీ అధినేత స్పందించారు.

news18-telugu
Updated: May 21, 2020, 6:01 PM IST
‘హైదరాబాద్‌లో కూర్చుని కబుర్లు చెబుతున్న చంద్రబాబు’ కామెంట్లపై టీడీపీ చీఫ్ రియాక్షన్
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో కూర్చుని కబుర్లు చెబుతున్నారంటూ ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై టీడీపీ అధినేత స్పందించారు. ‘మాట్లాడినే నేను ఇక్కడ (హైదరాబాద్‌) కూర్చుని మాట్లాడుతున్నానంటున్నారు. మీరెక్కడ కూర్చున్నారు? బయటకు వస్తున్నారా? మీరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఏం చేశారు మీరు? మీ ఏరియా (సీఎం జగన్ నివాసం) కూడా కంటైన్మెంట్ జోన్‌లోకి వచ్చింది. రెడ్ జోన్ కిందకు వచ్చింది. అది మీరు సాధించిన ఘనత. అదే నేను ఉంటేనా? కేరళ మాదిరిగా చేయలేమా మనం. ఒకప్పుడు దేశం అంతా మనల్ని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు మనం దేశానికి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది.’ అని చంద్రబాబు అన్నారు. ‘నా మనసంతా అక్కడే ఉంది. కచ్చితంగా నేను అక్కడికి వెళ్లాలి. ఆయన ప్రవర్తనను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సంక్షోభం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ ప్రజల్ని వదిలిపెట్టలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా వంతు నేను చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మా వారికి సాయం చేయమని చెప్పా. మా వాళ్లు బయటకు రావడం కాదు. ఇంట్లోకి వచ్చి మరీ కేసులు పెట్టారు.’ అని చంద్రబాబు అన్నారు.
First published: May 21, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading