ఆత్మహత్యలు వద్దు... ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సూచన

తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

news18-telugu
Updated: October 14, 2019, 6:25 PM IST
ఆత్మహత్యలు వద్దు... ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు సూచన
శ్రీనివాసరెడ్డి, చంద్రబాుబ
  • Share this:
తెలంగాణలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇద్దరు కార్మికులు మనస్తాపంలో ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వార్త తనను కలిచి వేసిందని చంద్రబాబు అన్నారు. నెల్లూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ఈ అంశంపై స్పందించారు. ఆత్మహత్యలతో ఏ సమస్య పరిష్కారం కాదని చంద్రబాబు సూచించారు. జీవితం ఎంతో విలువైందని... బతికి సాధించాలే తప్ప బలవన్మరణాల వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన సూచించారు. కార్మికులెవరూ సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీడీపీ అధినేత విజ్ఞప్తి చేశారు.





Published by: Kishore Akkaladevi
First published: October 14, 2019, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading