వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. చంద్రబాబు ఏమన్నారంటే..

Chandrababu Naidu on Vasupalli Ganesh: పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధేనని పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: September 19, 2020, 9:30 PM IST
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. చంద్రబాబు ఏమన్నారంటే..
చంద్రబాబునాయుడు
  • Share this:
Vasupalli Ganesh News: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వైసీపీకి మద్దతు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత స్వార్ధంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా కార్యకర్తలు టీడీపీ వెన్నంటే ఉంటారని చంద్రబాబు తెలిపారు. స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. పార్టీలోకి నాయకులు వచ్చి పోతుంటారని... కానీ కార్యకర్తలే పార్టీతో శాశ్వతంగా ఉంటారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం కంచుకోట అని చంద్రబాబు అన్నారు.

Vasupally Ganesh, TDP MLA Joins YSRCP, YS Jagan, TDP MLA Jump to YCP, వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే, విశాఖ ఎమ్మెల్యే జంప్, వాసుపల్లి గణేష్
వాసుపల్లి గణేష్ కుమారులకు కండువా కప్పిన సీఎం జగన్,


హుద్‌హుద్‌ విపత్తు సమయంలో టీడీపీ కష్టాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని వ్యాఖ్యానించారు. జెండాను మోసి గెలిపించేది కార్యకర్తలేనని చంద్రబాబు గుర్తు చేశారు. జెండా పంచన చేరిన కొందరు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ద్రోహులకు టీడీపీలో స్థానం లేదని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధేనని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 19, 2020, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading