బరిలోకి బాలయ్య.. సీఎం జగన్‌పై సంధిస్తున్న చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొత్త అస్త్రాన్ని సంధించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 25, 2019, 5:00 PM IST
బరిలోకి బాలయ్య.. సీఎం జగన్‌పై సంధిస్తున్న చంద్రబాబు?
నందమూరి బాలకృష్ణ, సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొత్త అస్త్రాన్ని సంధించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తప్పనిసరి ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ పోరాడుతోంది. అయితే, మొదట ఇంగ్లీష్ మీడియంను తప్పుపట్టిన టీడీపీ.. ఆ తర్వాత కొంచెంమెత్తబడింది. తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారంటూ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అయితే, దీనికి కౌంటర్‌ ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వివాదం విషయంలో జగన్ మీద బాలయ్యను సంధించాలని ప్లాన్ చేసినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది.

డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తి.. దానిపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతో ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని టీడీపీ వ్యూహం పన్నినట్టు సమాచారం. ఆంధ్రుల అన్నగారుగా పేరుగాంచిన ఎన్టీఆర్ కుమారుడిగా, తెలుగువారి ఖ్యానికి దశదిశలు వ్యాపింపజేసిన మాజీ సీఎం కుమారుడిగా బాలయ్య అయితేనే దానికి కరెక్టని టీడీపీ భావిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంట్‌లో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడారు. తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్నిచెప్పారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో బాలయ్యలో అదే సీన్ రిపీట్ చేయించేందుకు టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>