ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆమోదించి మంత్రివర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్లనున్నారు.
ఏపీలో మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 10న కేబినెట్ భేటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున .. చంద్రబాబు అధికారిక సమావేశలు పెట్టే ఛాన్స్ లేదు. సాధారణంగా సమావేశం జరగదు. అయితే ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే తన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫణి తుఫాను బాధితులకు సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆమోదించి మంత్రివర్గ సమావేశానికి పంపాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు అంశానికి సంబంధించి విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వాదనలు ఎలా వినిపించలనే విషయంపై ఇతర పార్టీనేతలతో చంద్రబాబు చర్చించనున్నాట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం.
మరి ఇప్పటికే ఏపీలో ఉప్పు నిప్పులా మారిన సీఎం వర్సెస్ సీఎస్ వ్యవహారంతో... మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేబినెట్ నిర్వహణ అజెండాకు సీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ... బాబు కేబినెట్ భేటీకి ఓకే చెప్తారా ?లేదా? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ ఎల్వీ నో అంటే మాత్రం ఏపీలో రాజకీయం మరింత వేడక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.