చంద్రబాబు వ్యూహం... వైసీపీలో కలవరం ?

నిన్న టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిసి ఇదే అంశంపై కృతజ్ఞతలు చెప్పారు. దీంతో అమరావతి అంశం ఆధారంగా కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: November 29, 2019, 11:37 AM IST
చంద్రబాబు వ్యూహం... వైసీపీలో కలవరం ?
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబడుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. తాజాగా అమరావతిలో పర్యటించిన చంద్రబాబు... అమరావతిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ అంశాన్ని తాను జాతీయ నేతల దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పిన చంద్రబాబు...దీనిపై అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలిసి వివరిస్తానని చెప్పారు. అమరావతిపై చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు, పోరాటం చేయడం కొత్తేమీ కాకపోయినా... దీనిపై ప్రధానిని కలుస్తానని చంద్రబాబు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీతో తీవ్రంగా విభేదించి బీజేపీకి కటీఫ్ చెప్పిన చంద్రబాబు... ఎన్నికల్లో ఓటమి తరువాత మెల్లిమెల్లిగా తన వైఖరి మార్చుకుంటున్నారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకుండా దూరంగా ఉంటున్న టీడీపీ అధినేత... తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరినా... అంతగా స్పందించలేదనే అపవాదు ఉంది. ఇటీవల అమరావతిని ఇండియా మ్యాప్‌లో పెట్టడంపై ప్రధాని మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

నిన్న టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిసి ఇదే అంశంపై కృతజ్ఞతలు చెప్పారు. దీంతో అమరావతి అంశం ఆధారంగా కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ? అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే తమను తీవ్రంగా విమర్శించి... జాతీయస్థాయిలో తమకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబును మోదీ, షా అంత ఈజీగా మళ్లీ అక్కున చేర్చుకుంటారా ? అన్నది చర్చ కూడా సాగుతోంది.First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>