చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కీలక చర్చలు..

చంద్రబాబు, నందమూరి వారసుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించే అంశంపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

news18-telugu
Updated: August 18, 2019, 4:23 PM IST
చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కీలక చర్చలు..
నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతిలో చంద్రబాబునాయుడు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య  చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ను పరామర్శించారు. ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో చంద్రబాబు కొద్దిసేపు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలిసింది. కుటుంబ అంశాలతో పాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి వారసులను పక్కన పెట్టారని, బాలకృష్ణ రేసులో ఉన్నా.. యువ హీరోలను పట్టించుకోకపోవడం వల్ల యువ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయామనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో వ్యక్తమైంది. తెలంగాణ టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారంటూ గతంలో ఓ ఎమ్మెల్యే కూడా కామెంట్స్ చేశారు.

నందమూరి హరికృష్ణకు నివాళి అర్పిస్తున్న చంద్రబాబునాయుడు


ఈ క్రమంలో చంద్రబాబు, నందమూరి వారసుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించే అంశంపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి. అప్పటి వరకు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు