ఈ ముళ్లకిరీటాన్ని మోసేదెవరు? చంద్రబాబా? జగనా?

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం అతి పెద్ద సవాల్. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మరోవైపు అభివృద్ధి సాధించాలంటే ముళ్లకిరీటాన్ని తలకు ఎత్తుకోవడమే.

news18-telugu
Updated: April 21, 2019, 12:38 PM IST
ఈ ముళ్లకిరీటాన్ని మోసేదెవరు? చంద్రబాబా? జగనా?
ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు
  • Share this:
(రఘు - న్యూస్18 తెలుగు ప్రతినిధి - గుంటూరు)

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సస్పెన్స్‌గా ఉంది. టీడీపీ, వైసీపీ రెండూ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి. కానీ, అధికారంలోకి వచ్చేది ఒక్క పార్టీనే. అది ఎవరో మే 23న తేలుతుంది. అయితే, అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా.. పరిపాలన కొనసాగించడం మాత్రం పెను సవాలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మెరుగ్గాలేదు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం ఎలా? అధికారంలోకి రావడం కోసం ఇబ్బడిముబ్బడిగా హామీలు కురిపించిన పార్టీలు.. వాటిని ఎలా అమలు చేస్తాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Chandrababu Naidu, tdp, ys jagan mohan reddy, ysrcp, survey results, lok sabha election 2019, ap elections 2019, చంద్రబాబునాయుడు, టీడీపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ, సర్వే ఫలితాలు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2019, ఏపీ ఎన్నికలు 2019
చంద్రబాబునాయుడు (File)


ఏపీలో మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ విపరీతమైన హామీలు ఇచ్చింది. పింఛన్లు రూ.2వేలు, నిరుద్యోగ భృతి రూ.3000, రైతులకు ఏటా రూ.10,000 వంటి పథకాలను ప్రకటించింది. ప్రతి ఏటా రెండుసార్లు పసుపు కుంకుమ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అసలు ఉద్యోగుల జీతాలకే నిధులు లేకపోతే, ఇవన్నీ ఎలా అమలు చేస్తారనేది సస్పెన్స్.

వైసీపీ కూడా తక్కువ హామీలు ఇవ్వలేదు. ఆ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఆర్థికంగా ఖజానా మీద పెను భారం వేసేవే. పింఛన్ల పెంపు, పిల్లలను బడికి పంపిస్తే, ప్రతి ఏటా తల్లిఖాతాలో రూ.15వేలు డబ్బులు జమచేయడం, వెయ్యి రూపాయల ఖర్చు దాటిన జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ప్రతి ఏటా పంట సాయం కింద రూ.12,500 డబ్బులు ఇవ్వడం వంటివి వైసీపీ హామీల్లో కొన్ని. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడినవే. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా.. అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ముందుకు నడపడం కత్తిమీద సామే.

Actress sri reddy survey on ap assembly election poll here are the details,sri reddy,sri reddy leaks,sri reddy twitter,sri reddy facebook,sri reddy youtube,sri reddy ys jagan mohan reddy chandrababu naidu,sri reddy tdp chandra babu naidu,sri reddy ysrcp ys jagan mohan reddy,sri reddy comments on chandra babu naidu,sri reddy shocking comments on ys jagan mohan reddy,ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంపై టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎవరికీ వారు తామే అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికలపై శ్రీరెడ్డి తనకంటూ సొంత సర్వే చేసింది. ఈ సర్వేలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.sri reddy videos,actress sri reddy,sri reddy interview,sri reddy latest,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy news,sri reddy protest,sri reddy about nani,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy live,sri reddy tamil,sri reddy issue,sri reddy dance,sri reddy songs,sri reddy mallidi,jabardasth comedy show,tollywood,telugu cinema,ap politics,andhra pradesh news,andhra pradesh politics,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి ట్విట్టర్,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి యూట్యూబ్ వీడియోస్,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు,శ్రీరెడ్డి వైయస జగన్మోహన్ రెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
జగన్ మోహన్ రెడ్డి


ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది పవర్‌లోకి రావడం అనేకంటే ముళ్లకిరీటం తలకు ఎత్తుకోవడమే. ప్రజల మీద పన్నులు వేయకుండా, సంక్షేమ పథకాలను - అభివృద్ధిని, మధ్య మధ్యలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ ముళ్లకిరీటాన్ని తలకు ఎత్తుకునేది ఎవరో మే 23న తేలనుంది.
First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading