కొద్ది నెలల క్రితం టీడీపీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్‌పై తీవ్రమైన విమర్శలు చేసిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసే విషయంలో టీడీపీ నాయకత్వం ఎందుకో ఆలస్యం చేస్తోంది. వంశీ టీడీపీని వీడి నెలలు గడుస్తున్నా... ఆయనకు పోటీ గన్నవరంలో ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేసే విషయంలో చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. మరో టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలిసి వెంటనే ఆయన స్థానంలో టీడీపీకి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించిన చంద్రబాబు... గన్నవరం విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
గన్నవరంలో వంశీకి కౌంటర్ ఇచ్చే విధంగా టీడీపీ నాయకత్వం బాధ్యతలు తీసుకునేందుకు ఇద్దరు నేతలు రెడీగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధతో పాటు పుట్టగుంట సతీష్... గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ పోస్టు ఆశిస్తున్నారు. ఇందుకోసం వారు చంద్రబాబును కూడా కలిసినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధినేత ఈ విషయంలో ఎందుకో నిర్ణయం వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గన్నవరంలో వంశీని కౌంటర్ చేసేందుకు చంద్రబాబు కొత్త నేతను తయారు చేస్తున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి గన్నవరం విషయంలో చంద్రబాబు మౌనం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Gannavaram, Tdp, Vallabaneni Vamsi